హడావిడిగా ఒక డబ్బా టీజర్ ని కట్ చేసారని తారక్ అభిమానులు బాధపడుతున్నారు. తారక్ అండ్ హ్రితిక్ రోషన్ ఇద్దరు హీరోలు ఉండడంతో వ్యూస్ ఎక్కడికో వెళ్ళిపోతాయని అభిమానులు ఆశించారు.
కట్ చేస్తే టీజర్ ట్రోలింగ్ కి గురైంది, క్వాలిటీ లేని గ్రాఫిక్స్ తో తారక్ ను సరిగా చూపించలేదని అభిమానులు మండిపడుతున్నారు. ఎప్పట్లాగే హీరోయిన్ ను బికినీ లో చూపించి గ్లామర్ కోసమే హీరోయిన్ అన్నట్లు చూపించారు.
అయితే ఇప్పుడు ఎడిటర్స్ మరియు నిర్మాతలు ఎక్కడ దెబ్బ పడిందని ఆలోచనలో పడ్డారట. ఆగష్టు 14 సూపర్‌స్టార్ రజని కాంత సినిమా కూలి విడుదల అవుతోంది, దీంతో తీవ్ర పోటీ నెలకొంది.